telugu navyamedia
వ్యాపార వార్తలు

జియో యూసర్ల కు గుడ్ న్యూస్ ..

భారత దేశ అతి పెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కస్టమర్ల కోసం కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. టెలికాం రంగంలో సంచలనం శృష్టించిన జియో ఎప్పటికపుడు కొత్త ప్లాన్ ను తీసుకొస్తూ, యూసర్లను ఆకట్టుకుంటుంది.

కొత్తగా 5 ప్లాన్ ను అందుబాటులో తీసుకొచ్చింది. రిలయన్స్ జియో కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రారంభ ధర రూ .499. ఓ‌టి‌టి యాప్‌లకు సబ్‌స్క్రైబ్ చేయాలనుకునే కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ లలో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్ లతో పాటు సంవత్సరం పాటు ఉచితంగా “డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్” ను ఒక సంవత్సరం పాటు అందించంనుంది.

ముఖ్యంగా ఈ నెలలో ప్రారంభం కానున్న ను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్లాన్ లకు ఉచిత డిస్నీప్లస్ హాట్‌స్టార్స బ్‌స్క్రిప్షన్అందించినుంది. జియో ప్లాన్స్ మరియు వారి వివరాలు ఇలా ఉన్నాయి….

రూ.499 ప్లాన్‌తో రీచార్జ్ ..
రిలయన్స్ ప్రవేశపెట్టిన రూ.499 ప్లాన్‌ తో రీచార్జ్ చేసుకుంటే, 28 రోజుల వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 3 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

రూ.666 ప్లాన్‌తో రీచార్జ్..
తరువాత రీచార్జ్ ప్లాన్ విషయానికి వస్తే రూ.666 ప్లాన్‌తో రీచార్జ్ చేయిస్తే 56 రోజుల ప్లాన్ వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 2 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

రూ.888 ప్లాన్‌తో రీచార్జ్
ఇక రూ.888 రీచార్జ్ తో 84 రోజుల ప్లాన్ వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 2 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

రూ.2,599 ప్లాన్‌తో రీచార్జ్
రూ.2,599 ప్లాన్‌ విషయానికి వస్తే ఇది సవత్సరం పాటు అందించే ప్లాన్. ఈ ప్లాన్ లో 365 రోజుల ప్లాన్ వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 2 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా ఉచితంగా ఒక సంవత్సరం డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Related posts