telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

చార్జీల మోత తీసేస్తున్న .. జియో .. ఇక మళ్ళీ పండగే..

jio on charges to other networks

జియో తమ కస్టమర్లకు ఇటీవల కొంతమొత్తాన్ని రీఛార్జి రూపంలో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం మొదట అంతా ఫ్రీగా సాగిన జియో ప్రయాణం, మెల్లగా కస్టమర్లను ఆకర్షిస్తూ ఒక్కొక్కటిగా ఎంతో ఎత్తుకు ఎదిగి, అనతి కాలంలోనే భారత దిగ్గజ టెలికాం ఆపరేటర్లతో ఒకటిగా నిలిచింది. వాస్తవం చెప్పాలంటే, జియో వచ్చిన తరువాతనే మన దేశంలో ఇంటర్నెట్ ధరలు పూర్తిగా తగ్గి, సగటు వినియోగదారుడు కూడా పూర్తి స్థాయి ఇంటర్నెట్ వినియోగించగలుగుతున్నాడు అనేది ఒప్పుకోక తప్పదు. అయితే ఈ మూడేళ్ళలో కొన్ని కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకున్న జియో సంస్థ, ఈనెల నుండి సడన్ గా ఇతర మొబైల్ నెట్వర్క్స్ కు చేసే కాల్స్ కు IUC చార్జెస్ పేరుతో కొంత సొమ్మును వసూలు చేస్తోంది. నిజానికి ఈ గడిచిన మూడేళ్ళలో కొన్ని వేల కోట్లరూపాయలు ఈ చార్జీల రూపంలో కస్టమర్ల కోసం సంస్థ భరించిందని, అయితే ప్రస్తుతం ఈ ఏడాదిలో మిగిలి ఉన్న ఈ మూడు నెలలు మాత్రం సంస్థకు ఆ చార్జీలు భరించే స్థోమత లేదని జియో సంస్థ తెల్పడం జరిగింది.

రాబోయే 2020 జనవరి తరువాత ఈ చార్జీలు చాలావరకు రద్దయి, మళ్ళి కస్టమర్లకు ఇతర నెట్వర్క్ లకు కూడా ఫ్రీ కాల్స్ చేసే అవాకాశం ఉందని తెలిపింది. అయితే నేడు కొందరు టెక్ నిపుణుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, రాబోయే మిగిలి ఉన్న ఒక్క నెలకు గాను తమ కస్టమర్లు ఇతర నెట్వర్క్ లకు కాల్స్ చేసుకునేందుకు రీఛార్జి చేసుకుంటే సరిపోతుందని, రూ.149 ప్లాన్ కొన్ని మార్పులు చేసి జియో ప్రవేశపెట్టడం జరిగిందట. సో, దీనిని బట్టి రాబోయే జనవరి తరువాత ట్రాయ్ యొక్క నూతన నిబంధనలను బట్టి జియో కస్టమర్లకు ఈ చార్జీల నుండి విముక్తి లభించే అవకాశం దాదాపుగా ఉన్నట్లేనని, ఒకవేళ ఇది కుదరకపోయినా, ఇతర నెట్వర్క్ లకు చేసుకునే కాల్స్ కు నిమిషానికి ఒక పైసా మాత్రమే చార్జీలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా దీనిపై డిసెంబర్ నెల చివరి వారంలో పూర్తి స్థాయిలో సమాచారం వస్తుందని జియో సంస్థ ప్రతినిధులు కొందరు చెపుతున్నారట. కాగా ఒకరకంగా ఇది జియో కస్టమర్స్ కు మంచి వార్తే అని వారు అంటున్నారు…..!!

Related posts