telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

జియో బ్రౌజర్.. హిట్టే…

jio browser hit talk

జియో సిమ్, ఆ తరువాత మొబైల్, ఇప్పుడు బ్రౌజర్.. ఇలా ఒకొక్కటిగా ఆ సంస్థ వినియోగదారులకు మరింతగా దగ్గరవుతుంది. కొత్త సంవత్సరానికి బంపర్ ఆఫర్లు ప్రకటించడంతోపాటుగా బోనస్ గా బ్రౌజర్ ను కూడా విడుదల చేసింది. టెలికమ్ దిగ్గజం రిలయన్స్ జియో, స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం ఓ సరికొత్త అప్లికేషన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియో బ్రౌజర్ యాప్ పేరుతో ఈ అప్లికేషన్ లభ్యమవుతోంది. ఈ సరికొత్త ఇంటర్నెట్ బ్రౌజింగ్ యాప్‌లో పలు విప్లవాత్మక ఫీచర్లను జియో పొందుపరిచింది. జియో బ్రౌజర్ యాప్ యాప్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జియో‌ఫోన్‌లో గేమ్స్ వస్తున్నాయ్, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచిన జియో బ్రౌజర్ యాప్‌ను ఇప్పటికే 10 లక్షలకు పై ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ రన్ అవటానికి ఎటువంటి జియో కనెక్షన్ అవసరం ఉండదు. కాబట్టి, ఈ యాప్ జియో యూజర్లకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్ కాదు. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ కూడా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికైతే జియో బ్రౌజర్ యాప్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులో లేదు. ఐఓఎస్ వెర్షన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారనేదాని పై కూడా ఓ స్పష్టత లేదు. రిలయన్స్ జియో చెబుతోన్న దాని ప్రకారం జియో బ్రౌజర్ అప్లికేషన్‌ను ప్రత్యేకించి ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్థి చేశారు.

జియో బ్రౌజర్ యాప్ మొత్తం 8 భాషలను సపోర్ట్ చేస్తుంది. వాటి వివరాలు.. తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ. యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా కావల్సిన భాషను మార్చుకునే వీలుంటుంది. జియో బ్రౌజర్ యాప్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించదు. యాప్ సైజ్ కేవలం 4.5ఎంబి మాత్రమే. జియో బ్రౌజర్ యాప్ హోమ్ పేజీ పై పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఇంకా టెక్నాలజీలకు సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఈ యాప్‌లో న్యూస్ అప్‌డేట్‌లకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో సెక్షన్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

Related posts