telugu navyamedia
రాజకీయ వార్తలు

జిన్ పింగ్ సొంతకారుతో .. భారత్ పర్యటన.. సాంప్రదాయమట …

jinping in his own car in india

భారత పర్యటనకు జిన్ పింగ్ సొంతకారు తెచ్చుకున్నాడు. హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది లగ్జరీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి కమ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేతలు కూడా ఇప్పటికీ హాంకీనే ప్రిఫర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోటల్ నుంచి మామల్లపురం వరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. హెలికాప్టర్‌లో వెళ్లకుండా.. జిన్‌పింగ్ సుమారు 53 కిలోమీటర్ల దూరాన్ని కారులో ప్రయాణించారు. దీనికి చైనా అధికారులు ఓ రీజన్ ఇచ్చారు. ఆ దేశ విధానం ప్రకారం.. చైనా నేతలు హెలికాపర్లలో వెళ్లడం నిషేధం. దీన్ని వాళ్లు ఓ రూల్‌గా భావిస్తారు.

కేవలం విమానాలు, కార్ల ద్వారా మాత్రమే చైనా నేతలు ప్రయాణిస్తారని ఆ దేశ అధికారి ఒకరు చెప్పారు. గతంలో జీ20 లాంటి సమావేశాల సమయంలోనూ.. జిన్‌పింగ్ హెలికాప్టర్లను వాడలేదట. అమెరికా అధ్యక్షులు ఎలాగైతే కాడిల్లాక్ బీస్ట్‌లో ప్రయాణిస్తారో.. చైనా అధ్యక్షులు కూడా అలాగే హాంకీలోనే వెళ్తుంటారు.

Related posts