telugu navyamedia
రాజకీయ వార్తలు

క్లయిమెట్ ఒప్పందానికి చైనా పూర్తి మద్దతు: జిన్ పింగ్

jinping

పారిస్ లో జరిగిన క్లయిమెట్ ఒప్పందానికి చైనా పూర్తి మద్దతు ఇస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి ప్రపంచం బయటపడే దిశగా పర్యావరణం కూడా ముఖ్యపాత్ర పోషించనుందని ఆయన అన్నారు.

భూమిని రక్షించేందుకు ప్రతి దేశమూ చర్యలు చేపట్టాలని కోరిన ఆయన, పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశంగా ఉన్న చైనా, వాయు కాలుష్యాలను తగ్గించాలని నిర్ణయించిందన్నారు. 2060 నాటికి కర్బన ఉద్గారాలు విడుదల చేయని తొలి దేశంగా చైనా మారనుందని అన్నారు. అన్ని దేశాలూ ఈ చారిత్రాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts