JET Airways Employee Salary will be Late on October 11

ఆగస్టు నుంచి పూర్తి జీతాల్లేవ్.. ఇంకా సంయమనం పాటించండి… జెట్ ఎయిర్ వేస్

ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రముఖ విమానాయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తమ పైలట్లకు, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి ఇంతవరకు కూడా సెప్టెంబరు నెలకు సంబందించిన జీతాలు ఇవ్వలేదు. ఆ జీతాలను ఈనెల 11, 26వ తేదీల్లో రెండు దఫాలుగా చెల్లిస్తామని సెప్టెంబరు 6న పైలట్ల యూనియన్ కు విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ చెప్పిన మాట ప్రకారం ఈనెల 11న జీతాలు చెల్లించలేమని వీలైనంత త్వరగా వేతనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది… అప్పటి వరకు పైలట్లు, ఉద్యోగులు కాస్త సంయమనం పాటించాలని..కోరుకుంటుంది…

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్ వేస్ ఆగస్టు నెలలో ఉద్యోగులకు కేవలం 75శాతం మాత్రమే వేతనం ఇచ్చింది. మిగిలిన 25% తర్వాత చెల్లిస్తామని చెప్పింది. ఇప్పుడు అక్టోబరు 11న సెప్టెంబరు నెలకు సంబంధించిన 50% వేతనం, ఆగస్టులో చెల్లించకుండా మిగిలిపోయిన 25% వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే ఆ మొత్తాన్ని ఇప్పుడు ఇవ్వలేమని తెలిపింది.ఈ విషయాన్నీ జెట్ ఇండియన్ పైలట్స్ యూనియన్, నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ)తో యాజమాన్యం సమావేశమై పరిస్థితిని వివరించింది. మరోసారి సమావేశమై ఎప్పుడు జీతాలు చెల్లిస్తారనే విషయంపై ఓ తేదీని నిర్ణయిస్తామని ఎన్ఏజీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *