telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘జెర్సీ’.. పుట్టినరోజు శుభాకాంక్షలతో..

jersi new look on nani birthday

ఈరోజు నటుడు నాని తన 35వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

jersi new look on nani birthdayసితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ నాని నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు టైటిల్‌ను ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది. నవ్యమీడియా తరుపున కూడా నాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Related posts