telugu navyamedia
సినిమా వార్తలు

4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసిన “జెర్సీ”

Jersey

‘జెర్సీ’ తో గ్రాండ్ గా మరోసారి నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి అడుగుపెట్టడం, సహచర ఆటగాళ్లతో గొడవపెట్టుకోవడం, శ్రద్ధతో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలను చూపించారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో శరవేగంగా దూసుకుపోతూ ఇప్పటివరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఇదే విషయానికి సంబంధించి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ నేపధ్యంలో చిత్రం విడుదల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులతో సహా ఓవ‌ర్సీస్ లో కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మరో ప్రక్క సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌రిగింది.

Related posts