telugu navyamedia
సినిమా వార్తలు

మరికాసేపట్లో “జెర్సీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం

Jersey

“జెర్సీ” తో గ్రాండ్ గా మరోసారి నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో శరవేగంగా దూసుకుపోతూ ఇప్పటివరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. 

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా హైదరాబాద్, శిల్పకళావేదికలో రాత్రి 7గంటల 30 నిమిషాలకి ప్రారంభం అయ్యింది. దీనికి సంబంధించి యూట్యూబ్ లో లైవ్ వీడియో ప్రసారం అవుతోంది. ఇప్పటికే వేదికపైకి యాంకర్ సుమ విచ్చేసి తన వాక్చాతుర్యంతో, క్రికెటర్ కాస్ట్యూమ్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నారు.

Related posts