telugu navyamedia
telugu cinema news

“జెర్సీ” ప్రీ రిలీజ్ వేడుక : జెన్యూన్ ఫిల్మ్స్ చాలా రేర్ గా వస్తాయి – వెంకటేష్

Jersey

“జెర్సీ” తో గ్రాండ్ గా మరోసారి నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో శరవేగంగా దూసుకుపోతూ ఇప్పటివరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. 

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా సోమవారం హైదరాబాద్, శిల్పకళావేదికలో రాత్రి 7గంటల 30 నిమిషాలకి ప్రారంభం అయ్యింది. దీనికి సంబంధించి యూట్యూబ్ లో లైవ్ వీడియో ప్రసారం అయ్యింది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ విచ్చేయగా… నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్, దర్శకుడు వెంకీ కుడుముల, దర్శకుడు మారుతీ, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, దర్శకుడు విక్రమ్, చిత్రనిర్మాతలు తదితరులు హాజరయ్యారు. వీరంతా సినిమా హిట్ కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ తదితరులు స్టేజ్ పైనే క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు. మీరు కూడా ఈ వీడియోలను వీక్షించండి.

Related posts

నవలా మణీ!”

vimala p

‘ఈ2మ‌న‌సులు’ టీజ‌ర్…

vimala p

65 ఏళ్ళ వయసులో.. పండంటి పాపకి జన్మనిచ్చిన.. బామ్మ… ప్రపంచ రికార్డు..

vimala p