telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జెన్నిఫర్ లోపేజ్ తో అలేక్స్ రోద్రిగే .. నిర్చితార్థం .. !

jennifer lopez engaged with alex

దాదాపు రెండేళ్ళకి పైగా వీరిద్దరు డేటింగ్‌లో ఉండగా, ఎట్టకేలకి వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. మ్యూజిక్ ఐకాన్ జెన్నీఫర్ లోపేజ్(49) మాజీ బేస్ బాల్ స్టార్ అలేక్స్ రోద్రిగే(43)తో నిశ్చితార్దం జరిగింది. అలెక్స్ .. జెన్నీఫర్ చేతికి తొడిగిన వజ్రపు ఉంగరం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి4 న ఈ జంట రెండో సంవత్సరం యానివర్సరీ జరుపుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరు తొలిసారి 2005లో షియా స్టేడియంలోని క్వీన్స్ బ్యాక్‌లో కలిసారు. అలెక్స్ 22 సీజన్స్‌లో బిగ్ లీగ్స్ లో పాల్గొనగా 2016లో రిటైర్ అయ్యారు. ఇక జెన్నీఫర్ విషయానికి వస్తే గతంలో ఆమె మూడు సార్లు వివాహం చేసుకుంది. ఆమె 11 ఏళ్ళ కవల పిల్లలకి తల్లి కూడా. జెన్నీఫర్ మ్యూజికల్ హిట్స్‌లో జెన్నీ ఫ్రమ్ ది బ్లాక్, లవ్ డోంట్ కాస్ట్ ఏ తింగ్‌, వెయిటింగ్ ఫర్ టూ నైట్ ప్రముఖమైనవి.

 

View this post on Instagram

 

♥️♥️♥️♥️♥️♥️♥️♥️

A post shared by Jennifer Lopez (@jlo) on

Related posts