telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ కు లిప్ కిస్ ఇచ్చిన స్టార్ హీరోయిన్…!?

Jennifer

ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ యానిస్టన్, ఫేమస్ టీవీ పర్సనాలిటీ ఎల్లెన్ దెజనరెస్‌లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ అమెరికన్ కామెడీ సిరీస్ ‘ఫ్రెండ్స్’తో బాగా పాపులర్ అయిన జెన్నిఫర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ తెరిచారు. ఆమె పోస్ట్ చేసిన తొలి ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ పర్సనాలిటీ ఎల్లెన్.. తన స్నేహితురాలైన జెన్నిఫర్‌ను తన షోకు ఆహ్వానించారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ కావడంతో ఎల్లెన్ పిలవగానే జెన్నిఫర్ వెళ్లారు. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలుసుకోవడంతో ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చేసుకున్నారు. దాంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. లిప్ కిస్ ఇచ్చాక జెన్నిఫర్.. ‘ఎలా ఉంది? నా ముద్దును ఎంజాయ్ చేశావా? లేక భయపడ్డావా?’ అంటూ ఎల్లెన్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఎల్లెన్ స్పందిస్తూ.. ‘చాలా నచ్చింది’ అని చెప్పారు. అయితే ఎల్లెన్ స్వలింగ సంపర్కురాలు. ఆమెకు 2008లో పోర్టియా రోస్సీ అనే నటితో పెళ్లైంది. దాంతో ఎల్లెన్ మరో మహిళను ముద్దు పెట్టుకోవడం వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts