telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మైనర్ బాలికలతో వేశ్యావృత్తి…. అనంతరం ఆత్మహత్య

Jeffrey Epstein Dead By Apparent Suicide in Prison

అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందరో అమెరికన్ రాజకీయవేత్తలు, సెలెబ్రిటీలతో చనువుగా మెలిగిన జెఫ్రీ.. మైనర్ బాలికలను అక్రమంగా అమెరికాకు తరలించి, వారిని బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపేవాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలను జెఫ్రీ తీవ్రంగా ఖండించాడు. అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైతే జీవితఖైదు పడే అవకాశం ఉంది. ఈ కేసులో తనకు బెయిలివ్వాలంటూ జెఫ్రీ చేసిన అప్పీలును కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని జైల్లో ఉన్న జెఫ్రీ ఉరిపోసుకున్నాడు. శనివారం ఉదయం జైలు అధికారులకు అతని మృతదేహం కనిపించింది. గత జూలైలో కూడా జెఫ్రీ ఒకసారి ఆత్మహత్యా యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.

Related posts