telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

కాంగ్రెస్ లీడర్ కౌశిక్ పై ..జీవితా రాజశేఖర్‌‌ ఫిర్యాదు

Jeevitha Rajasekhar Complent Koushik

సినీన‌టుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌‌‌‌పై కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని జీవితా రాజశేఖర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుణకు సంబంధించిన దుకాణం ముందు అక్రమంగా కౌశిక్ కారు పార్కింగ్ చేయడంతో.. ఇక్కడెందుకు పార్కింగ్ చేశావంటూ గుణశేఖర్ వెళ్లి ఆయన్ను ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహానికి లోనైన కౌశిక్ దాడి చేసినట్లు జీవితా ఆరోపిస్తున్నారు.

షాపు ముందున్న సీసీ ఫుటేజీని సేకరించి ఆధారాలతో సహా బంజారాహిల్స్‌లోని సీపీ కార్యాలయానికి వెళ్లి ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు. గుణతో పాటు జీవితా రాజశేఖర్ కూడా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయ‌న‌ను తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదులొ పేర్కొన్నారు.

Related posts