telugu navyamedia
సినిమా వార్తలు

“మా” సొమ్ము జీవిత కూతురు ఖాతాలోకి… స్పందించిన జీవిత

Jeevitha-Rajasekhar

“మా” అసోసియేషన్ లో డబ్బుని ప్రభుత్వ ప్రకటనలు చేయడానికి ఉపయోగించారని, “మా” సొమ్ము జీవిత కూతురు ఖాతాలోకి చేరిందని ఈరోజు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అసోసియేషన్ లో డబ్బు సభ్యుల కోసం వినియోగించకుండా ప్రభుత్వ యాడ్లు చేయడం ఏంటనే వివాదం తలెత్తింది. దీనిపై స్పందించిన సినీనటి, “మా” కార్యదర్శి జీవిత “మా”లో డబ్బు ఖర్చు చేసిన మాట వాస్తవమేనని, నిబంధనల ప్రకారమే అలా చేశామని ఒప్పుకున్నారు. కార్యవర్గంలో అందరికీ ఈ విషయం తెలుసని, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఆఫీస్ కి వస్తే వివరణ ఇస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు ఉంటే మా సంఘంలో వారికి కూడా అందేలా చేస్తామని హామీ ఇచ్చిందని, కారణంగానే తమ వంతుగా ఆ మంచి పథకాలను ప్రచారం చేయాలని నిర్ణయించామని, చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందించామని, ఆ సమయంలో “మా” అధ్యక్షుడు నరేష్ మరొక చోట ఉండడంతో డబ్బు తను అడ్జస్ట్ చేసినట్లు జీవిత వివరించారు. అందువల్లనే మళ్లీ ఆ మొత్తాన్ని “మా” నుండి తీసుకున్నామని, ఇంత తక్కువ మొత్తానికి ఎవరూ ప్రకటనలు చేయించలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి సహాయం పొందాలనుకున్నప్పుడు తమవంతు కృతజ్ఞతతో చేశామే తప్ప మరో ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.

Related posts