telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

జేఈఈ ఫలితాలు విడుదల.. గుజరాత్‌ విద్యార్థి టాప్

kartikey gupta topper

జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) 2019 ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్‌ 372కు గాను 346 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఐఐటీల్లో ప్రవేశ అర్హతను కల్పించే జేఈఈ ఫలితాలను ఐఐటీ– రూర్కీ శుక్రవారం విడుదల చేసింది. అలహాబాద్‌కు చెందిన గౌరవ్‌సింగ్‌ 340 మార్కులతో, ఢిల్లీకి చెందిన అర్చిత్‌ బుబ్నా 335 మార్కులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

హైదరాబాద్‌ జోన్‌కు చెందిన ఆకాశ్‌ రెడ్డి, కార్తికేయ బత్తెపాటి నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. మొత్తం 1,61,319 విద్యార్థులు పరీక్ష రాయగా 38,705 మంది అర్హత సాధించారు. అందులో 5,356 మంది మాత్రమే విద్యార్థినులు ఉన్నారు. జనరల్‌ కేటగిరీ నుంచి 15,556, ఆర్థికంగా వెనుకబడిన వర్గం నుంచి 3,636, బీసీ నుంచి 7,651, ఎస్సీ నుంచి 8,758, ఎస్టీ నుంచి 9,034 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్‌ 16 నుంచి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

కామన్‌ ర్యాంక్‌ లిస్టు (సీఆర్‌ఎల్‌)లో గుప్త కార్తికేయ మొదటిస్థానం సాధించగా, 308 మార్కులతో పదో ర్యాంక్‌ సాధించిన షబ్నమ్‌ సహాయ్‌ విద్యార్థిని విభాగంలో టాప్‌గా నిలిచారు. మాదాపూర్‌కు చెందిన సూరపనేని సాయి వంగ, ముంబైకి చెందిన తులిప్‌ పాండే విద్యార్ధినుల విభాగంలో రెండు, మూడు ర్యాంకులు సాధించారు.

Related posts