telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

జేఈఈ ప‌రీక్షకు కొత్త నిబంధన.. హాల్‌టికెట్ ఇచ్చిరావాలి!

exam hall entrence

ఐఐటీ‌ల్లో ప్రవే‌శాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వా‌న్స్‌డ్‌ పరీక్ష రేపు జ‌ర‌గ‌నుంది. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను ఐఐటీ ఢిల్లీ నిర్వ‌హిస్తున్న‌ది. ఉదయం 9 నుంచి 12 గంట‌ల‌ వరకు పేపర్-‌1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల‌ వరకు పేపర్-‌2 పరీ‌క్ష ఉంటుంది. కంప్యూట‌ర్ ఆధారితంగా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌ల‌కు తెలం‌గాణ, ఏపీ నుంచి 30 వేల మందికి పైగా విద్యా‌ర్థులు పరీ‌క్షకు హాజ‌రవ‌నున్నారు.

విద్యార్థులు రెండు ప‌రీక్ష‌లకు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌ర‌వ్వాల‌ని ఐఐటీ ఢిల్లీ సూచించింది. పేప‌ర్‌-2 ప‌రీక్ష ప్రారంభ‌మైన త‌ర్వాత హాల్‌టికెట్ల‌ను ఇన్విజిలేట‌ర్‌కు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని ప్ర‌క‌టించింది.

ఒక‌వేల హాల్‌టికెట్ ఇవ్వ‌నివారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ పరీక్ష ఫలి‌తాల‌ను అక్టో‌బర్‌ మొద‌టి‌వా‌రంలో విడు‌దల చేయ‌నున్నారు. ప‌రీక్ష అనంత‌రం హాల్‌టికెట్‌ను ప‌రీక్ష కేంద్రంలోనే ఇవ్వాల‌నే నిబంధ‌న‌ను మొద‌టిసారిగా విధించింది.

Related posts