telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జేడీఎస్ కుమారస్వామికి .. తీవ్ర అస్వస్థత..

devegowda umaraswamy

జేడీఎస్ నేత కుమారస్వామి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరిగిన ఆయన మంగళవారం అలసటకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా జయదేవ కార్డియాలజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. 14 రోజులుగా ఉప ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి పాల్గొన్నారు. రోజుకు రెండు బహిరంగసభలలో పాల్గొన్నారు. వాతావరణంలో మార్పు, ఒత్తిడి నేపథ్యంలో రెండు మూడు రోజులుగా జ్వరం ఉన్నా ప్రచారాలకు అంతరాయం కాకుండా కొనసాగించారు.

గతంలో ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్ళినప్పుడు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలోనూ జయదేవ ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. సీఎంగా కొనసాగుతుండగానే పలుమార్లు బహిరంగంగానే నాకు ఆరోగ్యం అంతంతమాత్రమేనని అందుకే రాజకీయాల్లోకి కుమారుడు నిఖిల్‌ను తీసుకొచ్చినట్టు చెప్పుకున్నారు. దగ్గు, జ్వరం తగ్గకపోవడంతో పలు విధాలా ఇబ్బందులు పడుతున్న కుమారస్వామి నగరంలోని జయదేవ ఆసుపత్రిలో చేరారు. జయదేవ డైరెక్టర్‌ డా.మంజునాథ్‌ ఆధ్వర్యంలో చికిత్సలు అందిస్తున్నారు.

Related posts