• Home
  • వార్తలు
  • కేసీఆర్ ను పొగిడిన జేడీ లక్ష్మీ నారాయణ…!
Trending Today రాజకీయ వార్తలు వార్తలు

కేసీఆర్ ను పొగిడిన జేడీ లక్ష్మీ నారాయణ…!

ex jd lakshminarayana on his political roamers

ఆదివారం రోజున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జేడి లక్ష్మీనారాయణ.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతు… తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుస్తున్నాయని అభిప్రాయపడ్డారు..

శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల కాలంలో ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లో అప్పట్లోనే గొలుసు కట్టు చెరువులను నిర్మించి పంటలకు నీటిని అందించేందుకు ఎంతగానో కృషి చేశారని… అలాంటి చెరువులను అభివృద్ధి చేసి, నీటి నిల్వలను పెంచేలా మిషన్‌ కాకతీయ పథకం చేపట్టడం అనేది ఎంతో గొప్ప నిర్ణయమని.. రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశం అభివృద్ధి పథంలో నడవడానికి సాధ్యమవుతుందని అయన అన్నారు

Related posts

ట్రంప్ జూ దంపతులు విడాకులకు అర్జీ…?

admin

భారత్ ఓటమికి కారణం సెలక్టర్లే అంటున్న వెంగీ

jithu j

ప్రేమకోసం రాజ్యాన్ని వదులుకున్న యువరాణి…మరోచరిత్ర 

jithu j

Leave a Comment