telugu navyamedia
సినిమా వార్తలు

“MMOF” సినిమాతో మాకు కొత్త శత్రువులు… : నిర్మాతలు

MMOF

చాలాకాలం తర్వాత జే.డీ.చక్రవర్తి హీరోగా నటిస్తున్న చిత్రం ‘MMOF’. ఈ సినిమాలో బెనర్జీ, అక్షత, అక్షిత ముద్గల్, శ్రీరామ్ చంద్ర, మనోజ్ నందన్ టార్జాన్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్.పి తదితరులు నటించారు. ఈ సినిమాకి సాయిరామ్ కార్తీక్ సంగీతం అందించగా.. ఎస్ఎస్‌సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాసిం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్,పోస్టర్‌లను దసరా సందర్భంగా విడుదల చేశారు. అయితే వీటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే ట్రెండింగ్‌లో లేకపోయిన ఆడియన్స్‌ను బ్లెండ్ చేసి ఇప్పుడు ట్రెండ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాతలు కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. ఫ్రెండ్సే కాదు మా శత్రువులు కూడా ఫోన్ చేసి టీజర్ గురించి పొగుడ్తూ మా ‘‘MMOF’’ టైటిల్ గురించి దాని మీనింగ్ ఏంటని ఆసక్తిగా అడుగుతున్నారు. ఇదే మా రియల్ సక్సస్ అని.. ఒకప్పుడు జేడీ గారి ‘‘పేరులేనిసినిమా’’ టైటిల్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బజ్ మా ‘‘MMOF’’ టైటిల్ క్రియేట్ చేస్తుందని అన్నారు. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ కూడ రిలీజ్ చేస్తున్నామని దానికొచ్చే ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మాకు కొత్త శత్రువులు కూడా ఏర్పడతారని పేర్కొన్నారు. ఇదంతా మా టీమ్ వల్లే సాధ్యమైంది అని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ఆడియోని ‘‘వేగా మ్యూజిక్’’ ద్వారా రిలీజ్ చేస్తున్నామని తెలియజేశారు.

Related posts