• Home
  • వార్తలు
  • గంగానది ప్రక్షాళన చేయాలని దీక్ష చేసిన…అగర్వాల్ మృతి…నిజమైన కుమారుడు అన్న రాహుల్..
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

గంగానది ప్రక్షాళన చేయాలని దీక్ష చేసిన…అగర్వాల్ మృతి…నిజమైన కుమారుడు అన్న రాహుల్..

jd agarwal died who fought for clean ganga river

గంగానది అంటే భారతీయులకు ఎంతో పవిత్రమైన పుణ్యనది. ఆ నదిలో స్నానాలు చేసి తమ తమ పాపాలను కడిగేసుకుంటారు భక్తులు. ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుండో గంగానది కి పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ నదీ ప్రాంతం అంతా కాలుష్యం బారిన పడింది. అది చూసి చలించిపోయిన ప్రముఖ పర్యావరణ వేత్త జేడీ అగర్వాల్(87) ఎప్పటి నుండో గంగానది ని కాలుష్య రహితంగా మార్చాలని దీక్ష పూనారు. అప్పటి నుండి ప్రభుత్వాన్ని పలుమార్లు ఆ విషయంపై నిలదీశారు. చివరికి తానే దీక్షకు కూర్చున్నారు. దాదాపు 100 రోజులపైనే సాగిన ఈ దీక్షలో ఆయన రోజు తేనే కలిపిన నీటిని తప్ప మీరేమి తీసుకోలేదు. మంగళవారం నుండి ఆ నీరు కూడా తీసుకోవడం మానేయడంతో ఆందోళనతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు, కానీ ఫలితం లేకుండా పోయింది. అగర్వాల్ ప్రాణాలు విడిచారు.

గంగానదికి తన జీవితాన్ని అంకితం చేసిన అగర్వాల్ ఐఐటీ కాన్పూర్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. అనంతరం గంగానదిని కాలుష్య రహితంగా చేయాలని దీక్షలు చేపట్టారు, ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. వాటి సాధన కోసం పలుమార్లు దీక్షలు చేపట్టారు. దీనితో దిగివచ్చిన ప్రభుత్వం కొన్ని డిమాండ్లను నెరవేర్చి, ఆయనను దీక్ష విరమించాలని కోరింది. ఆయన డిమాండ్ ప్రకారం గంగానది పరిరక్షణ చట్టం ముసాయిదాను కేబినెట్ పరిశీలనకు పంపారు. ఈ విషయాన్నీ మంత్రి నితిన్ గడ్కర్ తెలిపారు. అయితే అంతలోనే ఇలా అగర్వాల్ మృతి చెందటం పై పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గంగమ్మ తన అసలైన బిడ్డను కోల్పోయిందని స్పందించారు. కాగా అగర్వాల్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని జైరాం రమేష్ పేర్కొన్నారు.

Related posts

రాజ్ భవన్ లో రాఖీ వేడుకలు రద్దు: నరసింహన్

madhu

మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర.. హైదరాబాద్ లో లీటర్ 89 దాటింది…

chandra sekkhar

తన తండ్రిపై వచ్చిన లైంగిక ఆరోపిణలపై స్పందిస్తూ… నటి నందితా దాస్ వ్యాఖ్యలు

nagaraj chanti

Leave a Comment