telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జయరాంపై.. విషప్రయోగం జరిగిందా.. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక..

Jayaram Murder case Arrested Accused

నగరంలో సంచలనం రేపిన వ్యాపారవేత్త మృతదేహం కేసు మలుపులు తిరుగుతుంది. హత్య అని నిర్దారించుకున్నప్పటికీ, ఆయనకు విషం ఇచ్చి చంపినట్టు తెలుస్తున్నప్పటికీ, పోస్ట్ మార్టం నివేదిక వచ్చేవరకు వేచిచూడాల్సిదని అధికారులు అంటున్నారు. ఆ నివేదిక అనంతరం దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు. ఇక కేసు వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళుతూ, మార్గమధ్యంలో తన సొంత కారులోనే విగతజీవిగా కనిపించిన చిగురుపాటి జయరామ్ పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరుగగా, ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే, ఆయన మృతదేహం నీలిరంగులోకి మారింది. ఈ విషయాన్ని ఈ ఉదయం గుర్తించిన పోలీసులు, విషమిచ్చి ఆయన్ను చంపించి వుండవచ్చని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.

కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన నిన్న తెల్లవారుజామున జయరామ్ మృత దేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జయరామ్ మేనకోడలు, ఆయన నడిపిన టీవీ చానల్ ఎండీ శ్రిఖా చౌదరిని నిందితురాలిగా భావిస్తున్న పోలీసులు, ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మరణించగా, నాటి నుంచి ఆస్తి గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Related posts