telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆజంఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జయప్రద

Jayaprada fire Ajamkhan comments

బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ఈ వ్యవహారం పై జయప్రద ఘాటుగా స్పందించారు. రాంపుర్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న తనను ఆజాం ఖాన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంపూర్ విడిచే ప్రసక్తే లేదని నటి జయప్రద స్పష్టం చేశారు.

మహిళలను చులకన భావంతో చూసే ఆజంఖాన్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈసీ అనుమతివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ములాయం, అఖిలేశ్ యాదవ్ లకు ముస్లింల ఓట్లు కావాలని, అందుకే, ఆజంఖాన్ పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ములాయం, అఖిలేశ్ కుటుంబాల్లోని మహిళలకు ఇలాంటి అవమానం జరిగితే వాళ్లు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

Related posts