telugu navyamedia
రాజకీయ

వెనకంజలో జయప్రద.. ఆధిక్యంలో సుమలత  

sumalatha comments kumara swamy

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి  బీజేపీ  అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయప్రద వెనకంజలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఆజం ఖాన్ లీడ్‌లో దూసుకుపోతున్నారు. గతంలో రెండు సార్లు ఇదే స్థానంలో జయప్రద గెలుపొందారు. సమాజ్ వాదీ అభ్యర్థిగా 2004, 2009 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆమెకు ఈ సారి ఎదురు గాలి వీస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన సినీనటి సుమలత మాండ్యాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో ఉన్న నటుడు ప్రకాశ్ రాజ్ వెనకంజలో ఉన్నారు.

Related posts