telugu navyamedia
business news culture news

మల్లెపూలకు రెక్కలు.. కిలో రూ. 3 వేలు!

jasmine market

తమిళనాడులో మల్లెపూల ధర ఒక్కసారిగా రెట్టింపైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వారం క్రితం రూ. 1500-1800 మధ్య ఉన్న ధర ఇప్పుడు రెట్టింపైంది. మార్కెట్ లో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ. 3 వేలకు చేరింది.

మరోవైపు పెళ్లిళ్లు జరుగుతూ ఉండటంతో మల్లెపూలకు డిమాండ్ అధికంగా ఉందని, ఇదే సమయంలో సరఫరా తగ్గడంతోనే పూల ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా మార్కెట్ కు వచ్చే పూలలో సగం కూడా రావడం లేదని వ్యాపారస్థులు అంటున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు కిలోల పూలను విక్రయించే వారు నేడు రెండు కిలోల అమ్మకాలకు కూడా నోచుకోవడం లేదని వారు వాపోతున్నారు.

Related posts

రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ .. కాంస్య పతకంతో .. 2020 ఒలింపిక్స్ కు అర్హత..

vimala p

2022 కల్లా .. కశ్మీర్ పూర్తిగా భారత్ లో .. : బీజేపీ మిత్రపక్ష నేత

vimala p

ఆ పోర్న్ చూసినా .. సీబీఐ పట్టుకుంటుందట.. తస్మాత్ జాగర్త!

vimala p