telugu navyamedia
Uncategorized

ఎన్టీఆర్ సాంగ్ కు జపనీస్ జంట అదిరిపోయే స్టెప్పులు… వీడియో వైరల్

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపనీస్ ఫ్యాన్స్ డ్యాన్సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, సమీరారెడ్డి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అశోక్’. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలోని ‘గోల గోల’ అనే ఫాస్ట్ బీట్ సాంగ్‌కు ఒక జపనీస్ జంట డ్యాన్స్ చేసింది. అచ్చం ఎన్టీఆర్, సమీరారెడ్డి స్టెప్పులను ఈ జంట దించేసింది. ఈ వీడియోను ఆ జపనీస్ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను డౌన్‌లోడ్ చేసుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు.

Related posts

అమరావతి ప్రాంత ప్రజలపై జగన్‌కు ఎందుకంత కోపం: దేవివేని ఫైర్

vimala p

రూ.400 కోట్లతో వేములవాడ ఆలయం అభివృద్ది: మంత్రి ఐకె రెడ్డి

vimala p

నేడే మూడో వన్డే : టాస్ గెలిచిన భారత్..! హ్యాట్రిక్+సిరీస్ .. దక్కేనా!

vimala p