telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ చేప ధర అక్షరాలా రూ.21 కోట్లు

Bluefin-Tuna

చేపల్లో అనేక రకాల చేపలను మనం చూస్తూనే ఉంటాము. అయితే ఆయా చేపలను బట్టి వాటి ధరలు కూడా ఉంటాయి. మాంసాహారాన్ని తినే ప్రతి ఒక్కరికీ ఈ విషయం బాగా తెలుసు. మన తెలుసు రాష్ట్రాల్లో అయితే పులస చేపను భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారు. అయితే విదేశాల్లో పులస కంటే ఎక్కువ రేటు పలుకుతున్నాయి కొన్ని చేపలు.

తాజాగా జపాన్ దేశంలో ఓ చేపల వ్యాపారి ఏకంగా 21 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ చేపను కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ చేప పేరు బ్లూఫిన్ టూనా. ఇది జపాన్ లో లభ్యమయ్యే అరుదైన చేప. అందుకే బ్లూఫిన్ టూనాకు అంత ధర. జపాన్ రాజధాని టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాత సుకిజీ అనే చేపల మార్కెట్ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున అరుదైన చేపలను వేలం వేస్తారు. ఈ సంవత్సరం ఇలా నిర్వహించిన ఈ వేలం పాటలో 278 కిలోల భారీ బ్లూఫిన్‌ టునా చేప ఏకంగా రూ.21 కోట్లు పలికింది. టునా చేపలను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే స్థానిక సుషీ రెస్టారెంట్ల యజమాని కియోషీ కిమురానే బ్లూఫిన్‌ టునాను దక్కించుకున్నారు. తాజాగా జరిగిన వేలంలో ఈ చేపను 333.6 మిలియన్లకు (భారత కరెన్సీలో రూ.21 కోట్లు) కొనుగోలు చేసి రికార్డుకెక్కారు కిమురా. 2013లో కూడా 155 మిలియన్‌ యన్‌లను (భారత కరెన్సీలో దాదాపు రూ.9 కోట్లు) టూనాను కొనుగోలు చేశారు ఈయన. అయితే జపాన్ రెస్టారెంట్ లో టూనా చేప ముక్క ధర వేలల్లో ఉంటుంది.

Related posts