telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేటి బంద్ లో పాల్గొనని జనసేన.. బాబు సై అన్నందుకేనా..

chandrababu on pavan alliance

నేడు ఏపీకి జరిగిన అన్యాయానికిగాను ప్రత్యేక హోదా సమితి ఆ రాష్ట్రంలో బంద్ ప్రకటించింది. ఈ బందుకు స్వయంగా ఏపీసీఎం మద్దతు ప్రకటించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రానికి వినిపించేలా, దేశం నలుమూలలకు ఈ విషయం వ్యాపించేలా నిరసనలు చేయాలనీ ఆయన పిలుపునివ్వడం గమనార్హం. అయితే అన్ని పార్టీలు నేటి బందులో పాలుపంచుకుంటుండగా.. జనసేన మాత్రం దూరంగా ఉండటం విశేషం.

పవన్-చంద్రబాబు ల మధ్య విభేదాలే ఈ దూరానికి కారణం అంటున్నాయి రాజకీయ వర్గాలు. అసలుకైతే జనసేనాని, బందులతో వరిగేది ఏమి ఉండదని, రాష్ట్రము మరోరోజు అభివృద్ధిలో వెనక్కిపోవడం తప్ప ఏమి ఉండదని అందుకే తాము బందుకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. మొదటి నుండి పవన్ బందులతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదనే వాదిస్తున్నాడు, నేటి బందులో పాల్గొనకపోవటానికి కారణంగా కూడా అదే చెప్పడం విశేషం. దీనికి రాజకీయ రంగు పులిమి, టీపీడీ-జనసేన మధ్య ఉన్న విభేదాలే ఈ బందుకు పవన్ దూరంగా ఉండటానికి కారణం గా ప్రచారం సాగుతుంది.

Related posts