telugu navyamedia
సినిమా వార్తలు

జాన్వీ పుట్టినరోజు… విశ్వనాథుని సందర్శనం

Jahnavi-Kapoor

దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు మార్చ్ 6న. ఈరోజు తన పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకుంది జాన్వీ. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు తమ పుట్టినరోజు వేడుకలకు గ్రాండ్ గా పార్టీ ఇస్తుంటారు. కొంతమంది అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. అయితే జాన్వీ ఇందుకు భిన్నంగా వారణాసిలో తన పుట్టినరోజును జరుపుకుంటోంది. నిన్ననే తన తండ్రి బోనీకపూర్, సోదరి ఖుషీ కపూర్ తో జాన్వీ కాశీకి వెళ్లారు. అక్కడ జాన్వీ తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవడంతో పాటు గంగా ఘాట్ వద్ద పూజలు చేశారు. అలాగే కాశీలో ప్రాచుర్యం పొందిన కచౌరీ గల్లీలో ఆహరం తీసుకోవడంతో పాటు బెనారసీ పాన్ తిన్నారు. ఇంకా రెండు రోజులు జాన్వీ కాశీలో బస చేయనున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.

Related posts