telugu navyamedia
telugu cinema news

వైమానిక యోధురాలిగా జాన్వీ కపూర్

Jhanvi-Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకుంది. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన “దఢక్” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది జాన్వీ. ఈ సినిమాతోనే నటనాపరంగా, గ్లామర్ పరంగా మంచి పేరుతోపాటు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది జాన్వీ కపూర్. ఈ చిత్రం తరువాత ఎన్నో ఆఫర్ల వెల్లువ వస్తున్నప్పటికీ జాన్వీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ మంచి కథలు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటోంది.

ఇప్పటికే “తఖ్త్” అనే భారీ మల్టీస్టారర్ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తోంది జాన్వీ. తాజాగా ఓ బయోపిక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితకథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన గుంజన్ సక్సేనా తీరు గురించి ఇప్పటికి చెప్పుకుంటుంటారు. ఇటీవలే గుంజన్ సక్సేనాను జాన్వీ కపూర్ కలుసుకుని ఆమె అనుభవాలను అడిగి తెలుసుకుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Related posts

ఒకేరోజు ముగ్గురు హీరోలతో… రాత్రీపగలూ తేడా లేకుండా…

vimala p

బికినీలో పిచ్చెకిస్తున్న… ‘సాహో’ భామ

ashok

ఆకట్టుకుంటున్న “దొరసాని” ట్రైలర్

vimala p