telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీకి షాక్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌..!

తెలంగాణ బీజేపీకి, జనసేనకి మధ్య వైరం పెరుగుతూనే ఉంది. టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి పీవీ కూతురికి తన మద్దతు ఉంటుందని పవన్‌ బహిరంగంగా ప్రకటించడంతో దూరం మరింత పెరిగింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నాయకత్వంపై పవన్‌ అసంతృప్తి చేయగా.. దానికి బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా తెలంగాణ బీజేపీకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరోషాక్‌ ఇచ్చారు. నాగార్జున సాగర్‌ ఎన్నికల బరిలోకి దిగేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు పవన్‌. ఇందుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీని ఎంపిక చేయడంతో పాటు ఎన్నికలు జరుననున్న నాగార్జున సాగర్‌కు కమిటీని ఎంపిక చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సరికొప్పుల నాగేశ్వరరావును నియమించారు పవన్‌. అలాగే నాగార్జున సాగర్‌ అధ్యక్షుడిగా దండగుల కిరణ్‌ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది జనసేన. కాగా..నొముల మృతి కారణంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఇక్కడ వచ్చే నెలలో ఉప ఎన్నిక జరుగనుంది.

Related posts