telugu navyamedia
andhra political

కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయను: పవన్ కల్యాణ్

కులాలను అడ్డుపెట్టుకుని తాను రాజకీయం చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కాపులకే ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ నేతలు అంటున్నారని తెలిపారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు తనకు సమానమేనని స్పష్టం చేశారు. తనకు దళితుల మీద ప్రేమ ఉందని జగన్ చెబుతారు. వెనుకబడిన కులాల గురించి మాట్లాడతారు. 
కానీ ఒక్కసారి పులివెందుల వెళ్లి చూడండి. దళితులను ఎంతగా ఇబ్బంది పెడతారో.. వాళ్ల ఇంటి ముందు దళితులు చెప్పులు విప్పి వెళ్లాలంట అని పవన్ దుయ్యబట్టారు. ఆయనేమో ఇక్కడికొచ్చి దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, వైఎస్ కుటుంబాలు రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయాయని   విమర్శించారు. చంద్రబాబు మామను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయితే, జగన్ తండ్రి వారసత్వంతో రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. ఒక్క జనసేన పార్టీ మాత్రమే ఎవరి అండ లేకుండా ప్రజల ముందుకు వచ్చిందని  పవన్ వ్యాఖ్యానించారు.

Related posts

మరో అల్పపీడనం .. ఏపీలో వర్షాలు ..

vimala p

సందర్భాన్ని బట్టి తాము పార్టీలు మారాం: రాజశేఖర్

vimala p

ఆర్టీసీ డిపో వద్ద తోపులాట.. స్పృహ తప్పి పడిపోయిన మహిళ

vimala p