telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జనసేన నేత అత్యావేశం.. ఈవీఎం ను నేలకేసి కొట్టేస్తే.. ఊరుకోవాలా..!

జనసేన అభ్యర్థి అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో చేసిన నిర్వాకం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి బూత్ లోపలికి వచ్చిన మధుసూదన్ గుప్తా, అక్కడున్న ఇతర పార్టీల ఏజంట్లతో గొడవ పడటమే కాకుండా, ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో అది పని చేయకుండా పోయింది.

అంతకుముందు ఆయన ఓటింగ్ కంపార్ట్ మెంట్లలో నియోజకవర్గం పేరును సరిగా రాయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts