telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీలో విలీనం చేస్తున్నా..జనసైనికులారా మీ అభిప్రాయమేమి.. : పవన్

pavan kalyan on ycp and tdp

అధికారం వద్దంటూనే విభజన తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఏపీలో పార్టీ పెట్టి ప్రచారం, పోటీ ఉండదంటూనే ప్రశ్నిస్తాను అంటూ ఐదేళ్లు కాలం గడిపేశాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే అప్పటికే రాజకీయ అనిచ్చితి ఉన్న ఏపీలో పోటీ చేస్తే తనకు ప్రాధాన్యత ఉండేదన్న విషయం విస్మరించి పార్టీ పెట్టిన తొలినాళ్లలో టీడీపీ కోసం ప్రచారం చేసి, మద్దతు ఇచ్చి పోటీకి మాత్రం దూరంగా ఉండిపోయింది జనసేన. అదే తప్పని తెలిసి, 2019 ఎన్నికలలో పాల్గొని, ఒక్కటంటే ఒక్కసీటు గెలిచింది.

దీనితో అత్యంత ఆదరణ ఉన్నదనుకున్న సమయం అంతా వృధా చేసి తీవ్రంగా నష్టపోయానని తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఓటమి తెచ్చిన నిరుత్సహం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. కనీసం లో కనీసం పది నుండి పదిహేను సీట్లైనా వస్తాయని, దానితో కర్ణాటకలో జేడీఎస్ లా ఏపీలో ప్రాధాన్యతను సంతరించుకోవచ్చనే ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి; బహుశా అదే పవన్ కు మళ్ళీ సినిమాల వైపుకు వెళ్లాల్సిందే అనే ఆలోచన తెచ్చి ఉండవచ్చు. అయితే పార్టీ సంగతి, ఎవరినో నమ్మి వాళ్ళకి అప్పగించే పరిస్థితి లేదు కనుక బీజేపీలో కలిపే ప్రయత్నం జరిగింది, దానిని ఆ పార్టీ వాళ్ళు స్వాగతించడంతో అధికారికంగా జనసేన అందుకు అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే బీజేపీలో జనసేనను విలీనం చేసేందుకు అధినేత సైనికుల అభిప్రాయాన్ని తెలపాలని కోరడం జరిగింది. అది నెట్ లో హాల్ చల్ అవుతుంది.

Related posts