telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రానున్న ఎన్నికల అనంతరం.. అమరావతిలో పవన్ ప్రమాణస్వీకారం.. : జనసేన

మరోసారి జనసేన పార్టీ పొత్తులపై తీవ్రంగా సమాధానం చెప్పింది. తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగి, తమకు ప్రజల అండదండలు ఎంతగా ఉన్నాయో నిరూపిస్తామని అంటున్నారు. చంద్రబాబు తప్పుడు సంకేతాలతో ప్రజలను మరోసారి మోసం చేసే చీప్ ట్రిక్స్ చేస్తున్నారని జనసేన ఆరోపించింది. అయితే, రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్ధసారది అన్నారు. బుధవారం ఆచంట శ్రీరామేశ్వరస్వామి సత్రంలో జనసేన నియోజకవర్గస్థాయి సమావేశం పార్టీ ఉభయగోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్‌ కలవకొలను నాగతులసీరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్ధసారధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ, పవన్‌తో పొత్తు పెట్టుకుంటే మీకేంటి అంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తూ కుట్రపూరితంగా పార్టీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం, వైసీపీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ జనసేనను అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికీ లేదన్నారు. రాబోయే ఎన్నికలలో పవన్‌కళ్యాన్‌ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. వంద రోజులు ప్రోగ్రాంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్‌ను జనంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కలవకొలను నాగతులసీరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని, అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్‌ యిర్రింకి సూర్యారావు మాట్లాడుతూ, ప్రజలు నమ్మిన పార్టీ జనసేన అని, అటువంటి పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు.

టిక్కెట్ల గురించి కొట్టుకోకుండా ముందస్తు ప్రకటనా..! : నియోజకవర్గ పార్టీ నాయకులు మల్లినీడి తిరుమలరావు మాట్లాడుతూ, ఆచంట టిక్కెట్‌ ఎవరికి ఇచ్చినా మనమందరం కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జనసేన సిద్ధాంతాల పోస్టర్లును ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, కనకరాజు సూరి, యర్రా నవీన్‌, జవ్వాది ఏసుబాబు, సమత లక్ష్మి, బలుసు ప్రభు, మువ్వల విల్సన్‌, బండి రమేష్‌, నారా శేషు, చిట్టూరి శ్రీనివాసు, మహ్మద్‌ ఆలీ, బొలిశెట్టి రాంబాబు, కలగ ప్రసాదు, గణేశుల నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts