telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో పవన్ కు భూములున్నయని దుష్ప్రచారం: జనసేన

pawan-kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన వర్గాలు మండిపడ్డాయి. అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది.

ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని వాళ్ళే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts