telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేటీఆర్ పై జానారెడ్డి ఫైర్…

అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది తెరాస.  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అన్నది తెరాస…  లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే .. పిఆర్సీ కమిషన్ ఇచ్చిన లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఎక్కడినుండి వచ్చింది అని జానారెడ్డి ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ సంగతి పక్కన పెడితే… నిరుద్యోగ భృతి ఏమైంది అని అన్నారు.  ప్రయోజనాలు… పరిస్థితి పట్టి పార్టీ లో చేరికలు ఉంటాయి. ఏ పోరాటం చేయకున్నా… గొప్పగా చూపించే వాళ్ళున్నారు. కాంగ్రెస్ ఏం చేసినా చూపించనోళ్లు ఉన్నారు. ఎంత వరకు కొట్లాడగలమో అంత కొట్లాడుతున్నాం. మేము పరిపాలనకు రాకపోయినా… ప్రజలకు మేలు జరగాలి.మా వల్లనే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రజలు మాకు అధికారం ఇస్తారు అని ఆయన తెలిపారు. అలాగే సోషల్ మీడియా లో పరుష పదజాలం తో దూషించే మాటలు ఎక్కువయ్యాయని రేవంత్ రెడ్డి అభిమానులను పరోక్షంగా ఉద్దేసిస్తూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా లో కాంగ్రెస్ లోని నాయకులు కూడా జాగ్రత్తగా పోస్టులు చేయాలన్న హైకమాండ్ నిర్ణయానికైనా పంపండి అంతేకానీ  మా నాయకుడు గొప్ప అని… మీ నాయకుడు ఏం చేశాడని పోస్టింగ్ లు మానుకోవాలని ఆయన అన్నారు. నాయకత్వం బలోపేతం కంటే… ఐక్యత దెబ్బతింటుందని ఆయన అన్నారు. అభిమానంతో అవగాహన లేకుండా చేయొద్దన్నఆయన పార్టీ కూడా సీరియస్ గా ఉండాలి..అలాంటి వారిపై పీసీసీ చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related posts