telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక : కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానారెడ్డి !

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి ఫైర్‌ అయ్యారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా..? సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు అబద్దాలు చెప్తున్నారని.. కాంగ్రెస్‌పై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారని.. అరేండ్లలో అద్భుతం చేశాం అంటున్నారని జానారెడ్డి పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా..? 10 వేల ఎకరాలు కూడా దళితులకు ఇవ్వలేదన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర కాంగ్రెస్‌దని… మేము ఇచ్చిన భూమి టీఆర్‌ఎస్‌ ఇవ్వాలనుకుంటే… 2 లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. నాగార్జున సాగర్ ఓటర్లు ఆలోచించుకోవాలని సూచించారు జానారెడ్డి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని.. తాము చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయాన్ని టీఆర్‌ఎస్‌ పంచిపెడుతుందన్నది గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు. మెట్రో రైలు, హైవేలు తెచ్చింది కాంగ్రెస్ కాదా… అద్భుతాలు అంటున్నారు…మీరు సాధించిన అద్భుతాలు ఏంటో చెప్పండి అని నిలదీశారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్.. బకాయిలు మాఫీ చేసింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 70 వేల కోట్ల అప్పు ఉందని…అరేండ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేయడం అద్బుతమా..? అని ప్రశ్నించారు. మంచిని అభినందించండి అని చెప్పే టీఆర్‌ఎస్‌… కాంగ్రెస్ అభివృద్ధిని అభినందించాదా..? అని నిలదీశారు. రైతు బంధును అభినందిస్తున్నాము… కానీ రైతు రుణమాఫీ ఏమైందని ఫైర్‌ అయ్యారు. ఇతరుల్ని అభినందించండి అని అడిగే ముందు… మీరు కూడా కాంగ్రెస్ ని అభినందించడం నేర్చుకోవాలని సూచించారు.

Related posts