తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

పొన్నాలకు టికెట్ ఇవ్వొద్దని..గాంధీభవన్ ముందు ఆందోళన!

MLA Ticket Ponnala , Congress Leaders Againist

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల్లోనూ అసమ్మతి సెగలు చెలరేగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని కోరుతూ పలువురు నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో గాంధీభవన్ వద్ద టికెట్ ఇవ్వొద్దంటూ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు.

గత నాలుగేళ్లుగా పొన్నాల నియోజకవర్గంలో కార్యకర్తలను, పార్టీని పట్టించుకోలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి ఆరోపించారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీ తో గెలిచే అవకాశం ఉందన్నారు. 75 ఏళ్ల వయసున్న పొన్నాలకు టికెట్ ఇవ్వొద్దనీ, ఆయన కారణంగా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related posts

తెలుగులో ‘నవాబ్‌’…అశోక్ వల్లభనేని..సొంతం

chandra sekkhar

దేవదాస్ లో ప్రారంభమైన కథ… నాగార్జున, నాని

nagaraj chanti

వేదన…

chandra sekkhar

Leave a Comment