telugu navyamedia
సినిమా వార్తలు

జేమ్స్ బాండ్ లో శృంగార సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షకుడు

Bond-25

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మ‌హిళ‌లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ “మీటూ” సెగ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ ఎదురు చూసే జేమ్స్‌బాండ్ చిత్రానికి కూడా త‌గిలింది. దీంతో త‌మ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ఎలాంటి వేధింపులూ ఎదుర‌వకుండా చిత్ర నిర్మాత‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సాధార‌ణంగా జేమ్స్‌బాండ్ సినిమాల‌న్నింటిలోనూ శృంగార స‌న్నివేశాలు అధికంగా ఉంటాయి. ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న 25వ చిత్రంలోనూ అలాంటి స‌న్నివేశాలు భారీగానే ఉన్నాయ‌ట‌. ఈ సినిమాలో జేమ్స్‌బాండ్‌గా డేనియల్‌ క్రెగ్‌, బాండ్‌ గర్ల్ గా అనా డీ ఆర్మ్స్ న‌టిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న స‌మయంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. శృంగార స‌న్నివేశాలు చిత్రీక‌రించే స‌మ‌యంలో ప్ర‌త్యేక శిక్ష‌కుల‌ను నియ‌మించార‌ట‌. వారు క్రెగ్‌, అనా డీ ఆర్మ్స్‌తోపాటు ఉంటూ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తూ ఉంటార‌ట‌. అంతేకాకుండా శృంగార స‌న్నివేశాల్లో న‌టించేట‌పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని తెలుసుకుని స‌ల‌హాలు ఇస్తూ ఉంటార‌ట‌.

Related posts