telugu navyamedia
andhra news political

ఏపీలో ఒవైసీని పట్టించుకునేవారు ఎవరూ లేరు: జలీల్ ఖాన్

Jaleel Khan slams to Asaduddin

ఏపీలో వైసీపీ అధినేత జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తానన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల పై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఘాటుగా స్పందించారు. ఈ నెల 30న రాజమండ్రిలో నిర్వహించే ‘జయహో బీసీ’ పోస్టర్‌ను విజయవాడ మాడపాటి క్లబ్‌లో జలీల్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవందమంది ఒవైసీలు వచ్చినా ఏమీ చేయలేరని, ఆయనను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఒక్కరు చాలని అన్నారు.

ఏపీలో ఒవైసీని పట్టించుకునేవారు ఎవరూ లేరని చెప్పారు. హైదరాబాద్‌లో కేవలం ఏడు స్థానాలకే ఎంఐఎం పరిమితమని అన్నారు. మహారాష్ట్ర, బీహార్‌లలో ఏమైందో మర్చిపోవద్దని ఒవైసీకి సూచించారు. ఏపీలో మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. ఇన్నాళ్లు కాలక్షేపం చేసింది చాలని, ఇకపై ఎన్నికల కోసమే పనిచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Related posts

రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీని వీడి వైసీపీలో చేరాను: అమలాపురం ఎంపీ

ashok

చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల మృతి

vimala p

కాంగ్రెస్ ను వీడనున్న బైరెడ్డి!

vimala p