telugu navyamedia
రాజకీయ వార్తలు

పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లుగా … జైపూర్‌, జోధ్‌పూర్‌, దుర్గాపూర్‌లు …

jaipur and jodpur railway stations best in neatness

ఇటీవల రైల్వేలో పరిశుభ్రతపై నిర్వహించిన సర్వేలో రాజస్థాన్‌లోని జైపూర్‌, జోధ్‌పూర్‌, దుర్గాపూర్‌లు అత్యున్నత స్థానాల్లో నిలిచి అరుదైన గౌరవాన్ని పొందాయి. రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ సర్వే వివరాలను వెల్లడించారు. రాజస్తాన్‌లో మొత్తం 720 స్టేషన్‌ల్లో సర్వే చేపట్టగా జైపూర్‌, జోధ్‌పూర్‌, దుర్గాపూర్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 109 సబర్బన్‌ స్టేషన్లలో అంధేరి, విరార్‌, నైగాన్‌ రైల్వే స్టేషన్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

జోన్లలో నైరుతి రైల్వే మొదటిస్థానం, దక్షిణ రైల్వే రెండోస్థానం, తూర్పు మధ్య రైల్వే మూడోస్థానంలో నిలిచాయి. 2016 నుండి రైల్వే ప్రతి ఏటా 407 ప్రధాన స్టేషన్లల్లో శుభ్రతపై థర్డ్‌ పార్టీతో ఆడిట్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది 720 స్టేషన్లను అదనంగా చేర్చింది. ఈ ఏడాది మొదటిసారిగా సబర్బన్‌ స్టేషన్లనూ సర్వేలో చేర్చారు.

Related posts