telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ సేతుపతి, శృతి హాసన్ సినిమాలో జగ్గూభాయ్

Jagapathibabu

లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల పట్టీ శృతి హాస‌న్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి పేరే బ‌లంగా విన‌ప‌డుతుంది. శృతి హాస‌న్ అమెరికాకు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ “టెడ్‌స్టోన్‌”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న “ట్రెడ్ స్టోన్‌”ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్ళీ సినిమాల‌తో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తితో జ‌ట్టు క‌ట్టింది. “లాభం” అనే టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, పురంపొక్కు ఎంగిర పొతువుద‌మై ఫేం ఎస్‌పీ జ‌న‌నథ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్ర టీంతో జ‌గ్గూభాయ్ క‌లిసాడు. చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అతి త్వ‌ర‌లోనే చిత్ర ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు టీం పేర్కొంది. జ‌గ‌ప‌తి బాబు ఎంట్రీతో లాభం సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

Related posts