telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రక్త శుద్ధికి, అధిక వేడికి.. ఇదే పరిష్కారం.. !

jaggery and its health benefits

చూడటానికి బంగారం రంగులో అందంగా, ఆకర్షణీయంగా ఉండే బెల్లం ఆరోగ్య ప్రదాయిని కూడా. ఆయుర్వేద వైద్యశాస్త్రాల్లో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు.

బెల్లంలో అనేక రకాలైన ఔషధ గుణాలున్నాయి. ప్రతిరోజు కాస్త బెల్లం ముక్క తినడం వల్ల రక్తశుద్థి జరిగి వ్యాధులు దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బెల్లం లివర్ పనితీరును మెరుగురుస్తుందట. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుందట. బెల్లంలోని యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలురోగ నిరోధక శక్తిని పెంచి ప్రీలాడికల్ ఇన్ఫెక్షన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

అధిక బరువుతో బాధపడేవారు రోజూ వందగ్రాముల బెల్లం తింటే సన్నగా అవ్వుతారట. అంతే కాదు ఎండవేడిమిని తట్టుకోవాలంటే బెల్లం పాకం తాగితే శరీరం చల్లబడుతుందట. అంతే కాకుండా ఆడవారిలో నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయట.

రోజువారీ వినియోగంలో పంచదారకు బదులుగా బెల్లం వాడకం చాలా మంచిది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని విశేషాలు ఉన్న ఈ బెల్లాన్ని రోజు ఆహారంలో కొంచమైనా చేర్చుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు.

Related posts