తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కేసీఆర్ మరో శిశుపాలుడు: జగ్గారెడ్డి

Jaggareddy fires on KCR Harish Rao

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు పై మాజీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ మరో శిశుపాలుడని ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో బుధవారం ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు చుక్కలు చూపించిన కేసీఆర్, హరీష్ రావుకు చుక్కలు చూపిస్తానని మండిపడ్డారు. పోలీసుల రక్షణ లేకుండా తాను సిద్దిపేటకు వస్తానని, దమ్ముంటే హరీష్ రావు పోలీసులు లేకుండా సంగారెడ్డికి రావాలని సవాలు విసిరారు.

రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. గెలిచిన 6 నెలల్లో నియోజకవర్గంలో 40వేల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, సంగారెడ్డి ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ డబ్బులను కేటీఆర్ విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నాడని ఆరోపించారు. టీడీపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు.

Related posts

రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని..!

madhu

పర్వదినాన అలజడి… వీధుల్లో ఆందోళనకారులు.. ఒక అధికారి మృతి

nagaraj chanti

ఇక నుండి వాట్స్ అప్…వారికీ మాత్రమే పని చేస్తుందట…

chandra sekkhar

Leave a Comment