telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండేసి పాత్రలలో .. జగపతిబాబు..

jagapati babu with balakrishna agian in dual role

విలక్షణమైన నటుడుగా జగపతి బాబు గుర్తింపు పొందారు. ఒక అగ్ర హీరోగా తన కెరీర్ లో ఏన్నో విజయాలను సాధించారు అయన. హీరోగా అంతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారో ఒక తండ్రి గా, ఒక విలన్ గా ఏ పాత్రలోనైనా జీవించగల వ్యక్తీ జగపతి బాబు. జగపతి బాబు చేతిలో ఏన్నో సినిమాలు రెడీ గా ఉన్నాయి అన్నీ కూడా ప్రేక్షకులు ఏంతో ఆసక్తిగా ఏదురుచూస్తున్న సినిమాలనే చెప్పాలి.

విలన్ గా జగపతి బాబును కెరీర్ ను మరోస్థాయికి తెసుకుని వెళ్ళింది లెజెండ్ సినిమా. ఈ చిత్రంలో జగపతి బాబు నటనకు ఏన్నో ప్రసంశలు వచ్చాయి. రంగస్థలం, మొన్నీ మధ్య బ్లాక్ బస్టర్ అయిన మహర్షి సినిమా తో సహా ఈ సంవత్సరం జగపతి బాబు మంచి హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ బాల కృష్ణ సినిమాలో విలన్ పాత్ర లో కనిపించనున్నారు.

జై సింహ ఫేం కెఎస్ రవికుమార్ దర్శకత్వం లో హై వోల్టేజి సినిమా “రూలర్” తెరకేక్కబోతున్న విషయం తెలిసిందే00. ఈ సినిమా మీద అందరికి భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఈ నెల మే 17వ తేదిన లాంచ్ కు సిద్దంగా ఉంది. సినీవర్గాల సమాచరం ప్రకారం జగపతి బాబు ఈ సినిమా లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ రెండు పాత్రలకు ప్రధాన భూమిక ఉందని యూనిట్ చెపుతుంది. అందులో ఒక పాత్ర గురించి మేకర్స్ సమాచరం ఇచ్చారు, కానీ రెండో రోల్ ఎలా ఉండబోతుంది అనే దానిపై వివరణ ఇవ్వలేదు. మొత్తానికి ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా సాగుతుందట. బాల కృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కుడా విలన్ పాత్ర లో కనిపించనున్నారు.

Related posts