telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మచిలీపట్నం పోర్టును మరచిపోయారు: జగన్

Ycp Jagan comments chandrababu Pawan
వైఎస్ మరణించిన తర్వాత మచిలీపట్నం పోర్టును మరచిపోయారని  వైసీపీ అధినేత  వైఎస్ జగన్ అన్నారు. సోమవారం  మచిలీపట్నంలో  నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు 33వేల ఎకరాల కోసం బాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాము కేవలం 4500 ఎకరాలను మాత్రమే పోర్టు కోసం సేకరిస్తామని తెలిపారు. చేపల వేటకు మత్స్యకారులు విరామం ఇచ్చే సమయంలో ప్రతి నెలకు రూ.10వేలను అందిస్తామని జగన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వమే నిర్మిస్తోందని హామీ ఇచ్చారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మహిళలను మోసం  చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్  విమర్శించారు. 
 

Related posts