telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ నటుడి లవ్ గురించి స్పందించిన తండ్రి

Jackie-Shroff

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటాని ప్రేమలో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై టైగర్ ష్రాఫ్ తండ్రి, ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు. “నా కుమారుడు అతని జీవితంలో తొలిసారి ఒక 25 ఏళ్ల అమ్మాయితో స్నేహం చేశాడు. అంతకు ముందు ఎవరి వైపూ చూడలేదు. ఇద్దరూ కలసి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. డ్యాన్సులు, వర్కౌట్లు కలసి చేస్తున్నారు. ఒక ఆర్మీ ఆఫీసర్ కుటుంబం నుంచి ఆ అమ్మాయి వచ్చింది. అందువల్ల డిసిప్లిన్ కు ఉన్న విలువేంటో ఆమెకు తెలుసు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారో, లేదా జీవితాంతం స్నేహితుల్లాగే ఉంటారో… ఎవరికి తెలుసు? ఇప్పటికైతే వారిద్దరూ స్నేహితులు మాత్రమే” అని జాకీ ష్రాఫ్ అన్నారు. మరి టైగర్ ష్రాఫ్, దిశా పటాని పెళ్ళి చేసుకుంటారా ? లేక స్నేహితులుగానే ఉండిపోతారో చూడాలి.

Related posts