telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అరెస్టులు ఆపకుంటే ఆందోళన ఉధృతం: ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్‌ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్‌ పార్క్‌ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.

ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్‌ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. అరెస్ట్‌ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అరెస్టులు ఆపకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులను ప్రభుత్వం ఆపాలన్నారు. అరెస్టులకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

Related posts