telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జబర్దస్త్ హాట్ బ్యూటీకి కరోనా!

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. తాజాగా జబర్దస్త్ హాట్ బ్యూటీ అయిన వర్ష కు కరోనా సోకింది. ఈ విషయాన్ని లైవ్ లోకి వచ్చి వర్ష ప్రకటించింది. రెండు రోజులుగా తన ఆరోగ్యం బాగలేదని.. ఈ నేపథ్యంలోనే కరోనా పరీక్షలు చేయించుకున్నానని పేర్కొంది ఈ భామ. ఆ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది వర్ష. ఈ విషయాన్ని లైవ్ లోకి వచ్చి ఎందుకు చెప్పాలని అనుకున్నానంటే.. బయట పరిస్థితి మరింత దారుణంగా ఉందని.. కరోనా పట్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె వెల్లడించింది. కరోనా తో చనిపోయినవారిని ప్యాక్ చేసి.. పడేస్తున్నారని.. ఆ ఘటన ను చూస్తే తన గుండె తరుక్కు పోతుందని.. ఈ విషయాన్ని లైవ్ లోకి వచ్చి చెప్పాలని అనుకున్నానని తెలిపింది వర్ష.

Related posts